Nithin | వరుస ఫ్లాప్స్ తర్వాత స్పీడ్ పెంచిన నితిన్… మూడు కొత్త ప్రాజెక్టులతో సక్సెస్ ట్రాక్‌పైకి?
Nithin | టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం తన కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఆయన, గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ‘చెక్’, ‘రంగ్ దే’, ‘మ్యాస్ట్రో’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ వంటి చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరచగా, గతేడాది విడుదలైన ‘తమ్ముడు’, ‘రాబిన్‌హుడ్’ సినిమాలు కూడా డిజాస్టర్లుగా మారి ఆయన మార్కెట్‌పై ప్రభావం చూపాయి.
Nithin | టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం తన కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఆయన, గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ‘చెక్’, ‘రంగ్ దే’, ‘మ్యాస్ట్రో’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ వంటి చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరచగా, గతేడాది విడుదలైన ‘తమ్ముడు’, ‘రాబిన్‌హుడ్’ సినిమాలు కూడా డిజాస్టర్లుగా మారి ఆయన మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో రూట్ మార్చిన నితిన్, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ సక్సెస్ ట్రాక్‌లోకి తిరిగి రావడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. విభిన్న కాన్సెప్ట్‌లతో సినిమాలు తెరకెక్కించే ఆనంద్, నితిన్ కోసం ఒక కొత్త తరహా కథను సిద్ధం చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి ఆసక్తి నెలకొంది.
ఇంతలోనే నితిన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందులో ఒకటి ‘ఆయ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు అంజి చెప్పిన కథ. ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. జూలై నుంచి షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాకుండా, మరో ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి కూడా నితిన్ సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉంది.
నితిన్ 2002లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్ననితిన్ ఆ తర్వాత ‘దిల్’, ‘సై’ సినిమాలతో యూత్‌కు దగ్గరయ్యారు. అయితే మధ్యలో వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న సమయంలో 2012లో వచ్చిన ‘ఇష్క్’ ఆయన కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసింది. అదే ఊపులో ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’, ‘అ ఆ’, ‘భీష్మ’ వంటి విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన స్థాయిని నిరూపించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ నితిన్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. అలాగే ‘భీష్మ’ కూడా ఆయనకు పెద్ద హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఈసారి కథల ఎంపికలో నితిన్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా, కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

