నితిన్(Nithin) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మాస్ట్రో(Maestro). ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల.. విడుదలకు నోచుకోలేదు. కరోనా సెకండ్ వేవ్ తగ్గాక.. సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ముందు మేకర్స్ భావించినా.. ఓటీటీ వైపే మళ్లీ మొగ్గు చూపారు.
ఇప్పటికే రిలీజైన మాస్ట్రో ట్రైలర్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో నితిన్.. అంధ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన నభా నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేశారు. హాట్స్టార్లో సెప్టెంబర్ 17న మాస్ట్రోను రిలీజ్ చేయనున్నారు.
బాలీవుడ్ మూవీ అంధాధున్కు ఈ సినిమా రీమేక్. అందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా.. టబు, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించారు.