నితిన్, శ్రీలీల జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకుడు. ప్రతిష్టాత్మ మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. ‘లుక్ ఇస్తే చాలే జానూ.. లక్కీగా ఫీలవుతాను.. కిక్కొచ్చే టచ్ ఇస్తావా వన్మోర్ టైమ్.. వన్మోర్ టైమ్..’ అంటూ సాగే ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, జీవి ప్రకాష్‌కుమార్ స్వరపరిచి, విద్యా వోక్స్‌తో కలిసి ఆలపించారు.
ప్రేమకోసం గర్ల్‌ఫ్రెండ్‌ని మరో అవకాశం కోరుతూ హీరో పాడే పాట ఇదని, హీరోలోని నిజాయితీని మెచ్చుకుంటూనే, కాస్త జాగ్రత్తగా ఉండమని హీరోయిన్ హెచ్చరించడం ఈ పాటలో ప్రత్యేకత అని, నితిన్, శ్రీలీల అద్భుతమైన కెమిస్ట్రీ, అట్రాక్టివ్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటలో హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్.