Nithiin-Vakkantham Vamsi Movie | ‘ఇష్క్’ తర్వాత నితిన్ కెరీర్ మంచి స్పీడ్ అందుకుంది. ఆ వెంటనే ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కావడంతో నితిన్ మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండు ఫ్లాపులు వచ్చిన ‘అఆ!’తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కేశాడు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే భారీ విజయం సాధించడంతో నితిన్‌పై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది. దాంతో ఆ తర్వాత ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవ్వలేక వరుస ప్లాపులు ఎదుర్కొన్నాడు. మధ్యలో ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ వచ్చిన ఆ తర్వాత మళ్లీ హాట్రిక్ ఫ్లాపులు పడటంతో ఆ హిట్ కాస్త కనిపించకుండా పోయింది.
ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన వక్కంతం వంశీ ఐదేళ్ల క్రితం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో మెగాఫోన్ పట్టాడు. కాగా తొలి సినిమానే డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకుంది. దాంతో మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి ఏకంగా ఐదేళ్లు సమయం పట్టింది. గతేడాది షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇక ఇప్పటికి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు. దాంతో అసలు ఈ సినిమా ఉందన్న విషయమే చాలా మంది సినీ లవర్స్ మర్చిపోయారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అదే దిశగా షూటింగ్‌ను వేగవంతం కూడా చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. నితిన్‌కు జోడీగా పెళ్ళిసందD బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చుతున్నాడు.