Nithiin Tammudu | టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తమ్ముడు (Tammudu |). వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తుంది.
ఈ చిత్రాన్ని 2025 జూలై 4న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నారు మేకర్స్. ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్‌ను అందించింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సినిమాలో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
𝐀ction, 𝐀dventure & 𝐀drenaline-Pumping Moments❤️🔥
The Epic Journey of #Thammudu takes a New Turn with “𝐀” from Censor🏹💥
The Purpose & Promise Justifies Everything!!#ThammuduOnJuly4th 🎯@actor_nithiin #SriramVenu #Laya @gowda_sapthami #SaurabhSachdeva @VarshaBollamma… pic.twitter.com/ZRL2cvgUCQ
— Sri Venkateswara Creations (@SVC_official) June 28, 2025