ANS Multiplex | టాలీవుడ్ యువ నటుడు నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు సమాచారం. అగ్ర హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ బాటలోనే నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కుర్ర హీరో ఏషియన్ సంస్థతో కలిసి ANS సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. నితిన్‌కు ఇంతకుముందే సితార(Sitara) థియేటర్ ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్ ప్రస్తుతం రేనోవేషన్లో ఉంది. అయితే ఇదే థియేటర్‌ను ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ థియేటర్‌కు ఏషియన్ నితిన్ సితార అని పేరు పెట్టినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలకు మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఇంతకుముందు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లు ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి Asian Mahesh Babu (AMB) మల్టీప్లెక్స్ కట్టి బాగా సక్సెస్ అయ్యారు. ఇక మహేష్ తర్వాత రౌడి హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మహబూబ్ నగర్లో AVD సినిమాస్ (Asian Vijay Devarakonda) అనే పేరుతో మల్టీప్లెక్స్ స్థాపించి సక్సెస్ అయ్యాడు. వీరిద్దరి తరువాత అల్లు అర్జున్ (Alu Arjun) కూడా AAA సినిమాస్ అని హైదరాబాద్ అమీర్‌పేట్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. తాజాగా AAA సినిమాస్ ప్రారభించి నేటికి సంవత్సరం పూర్తి చేసుకుంది.