Actor Nithiin | దాదాపు ఏడేళ్ల స్ట్రగుల్ తర్వాత ‘ఇష్క్’ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. ఈ సినిమా తర్వాత ఈ కుర్ర హీరో కెరీర్ మంచి స్పీడ్ అందుకుంది. ఆ వెంటనే ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కావడంతో నితిన్ మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండు ఫ్లాపులు వచ్చిన ‘అఆ!’తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కేశాడు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే భారీ విజయం సాధించడంతో నితిన్‌పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దాంతో ఆ తర్వాత నితిన్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవ్వలేక వరుస డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. మధ్యలో ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ వచ్చిన ఆ తర్వాత మళ్లీ హాట్రిక్ ఫ్లాపులు పడటంతో ఆ హిట్ కాస్త కనిపించకుండా పోయింది.
ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి. ఎక్స్ట్రా ఆర్డీనరి టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సినీ లవర్స్ మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్.. తన కెరీర్లో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రేపో మాపో సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది.
కాగా తాజాగా నితిన్ మరో సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడట. వకీల్‌సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన కథకు నితిన్ బాగా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట. వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ఆ మధ్యలో అల్లు అర్జున్‌తో ఐకాన్ అంటూ ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అదే కథను రామ్ పోతినేనితో చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా.. అది కుదరలేదు. కాగా ఇప్పుడదే కథతో నితిన్‌ను మెప్పించాడని ఇన్సైడ్ టాక్. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.