Macharla Niyojakavargam | మాస్ అవతారంలో నితిన్.. ఆకట్టుకుంటున్న ‘మాచర్ల నియోజకవర్గం’ ఫస్ట్ ఎటాక్
ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోలు మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఇదే వరుసలో యూత్ స్టార్ నితిన్ కూడా మాస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.
Nithiin Macharla Niyojakavargam First Attack | ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోలు మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మాస్ కథలు ఉంటేనే దర్శక నిర్మాతలను కలవడానికి సిద్దంగా ఉంటున్నారట.ఎందుకుంటే ఫ్యామిలీ సినిమాలతో పోల్చితే మాస్ సినిమాలతో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ వస్తుంది. ఇప్టటికే విజయ్, నాని, రామ్ వంటి యువ హీరోలు పూర్తీ స్థాయి మాస్ సినిమాలలో నటించారు. ఇదే వరుసలో యూత్ స్టార్ నితిన్ కూడా మాస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’. రొటీన్‌కు భిన్నంగా నితిన్ ఈ సారి పొలిటికల్ థ్రిల్లర్ కథతో రానున్నాడు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నితిన్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ ఎటాక్ వీడియోను విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ఈ వీడియో గమనిస్తే జాతరలో జరిగే ఫైటింగ్ సన్నివేశంలా అనిపిస్తుంది. పులి గెటప్‌లో విలన్లు నితిన్‌పై కత్తులతో దాడి చేస్తుంటే నితిన్ సింహంలా వాళ్ళకు ఎదురు నిలుస్తూ విలన్లను మట్టికరిపిస్తున్నాడు. మహతి స్వర సాగర్ నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రసాద్ మూరెళ్ళ కెమెరాతనం గొప్పగా ఉంది. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్రలో నటించనున్నాడు. మొదటి సారిగా నితిన్ పూర్తీ స్థాయి సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. రాజ్‌కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరీన్ థ్రెస్సా హీరోయిన్గా నటిస్తుంది.
Read also:
Rangasthalam | నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న ‘రంగస్థలం’.. ఫైనల్ కలెక్షన్లు ఎంతంటే?
Adipurush | ‘ఆదిపురుష్’ నుంచి ప్రభాస్ ఫస్ట్‌లుక్ వచ్చేది అప్పుడేనట?
RRR Collections | వంద కోట్ల క్లబ్లో ‘ఆర్ఆర్ఆర్’.. సౌత్ టు నార్త్ రికార్డుల వేట
Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

