Aadhi Pinisetty- Nikki Galrani Wedding | కోలీవుడ్ ప్రేమజంట ఆది పినిశెట్టి, నిక్కీ గర్లానీ వివాహా బంధంతో ఒకటైయ్యారు. గురువారం చెన్నైలో వీళ్ళ పెళ్ళి ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు టాలీవుడ్ హీరోలు నాని, సందీప్ కిషన్ హజరైయ్యారు. ప్రస్తుతం వీళ్ళ పెళ్ళి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2015లో వచ్చిన ‘మలుపు’ సినిమాలో వీరిద్దరూ కలిసి మొదటి సారిగా నటించారు. అప్పుడే మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఇదే క్రమంలో ఆ ఫ్రెండ్షిప్ కాస్త మరకతమణి సినిమాతో ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్ళు వీరిద్దరు ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచారు. ఈ క్రమంలో అందరిని షాక్‌కు గురిచేస్తూ మార్చి 24న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
ఆది పినిశెట్టి తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గర్తింపు తెచ్చుకున్నాడు. అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈయన ప్రధాన పాత్రలో నటించిన ‘క్లాప్’ నేరుగా సోని లివ్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన రామ్ హీరోగా నటిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది.