టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్ (18 Pages). పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో టైం ఇవ్వు పిల్లా పాటను కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన విషయం తెలిసిందే.
ఈ సాంగ్‌ను డిసెంబర్ 5న లాంఛ్ చేయబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా ఇప్పటికే తెలియజేశారు. కాగా సాంగ్ ఎలా పాడాడో తెలియజేస్తూ.. విడుదలైన వీడియో ఇపుడు అందరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన నన్నయ రాసిన పాటకు మంచి స్పందన వస్తోంది. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
డిసెంబర్ 23న గ్రాండ్‌గా థియటర్లలో విడుదల కానుంది 18 పేజెస్ . ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. 18 పేజెస్కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథనందిస్తుండటం విశేషం.
టైం ఇవ్వు పిల్లా సాంగ్ రికార్డింగ్.. వీడియో
Here's a sneak peek of #TimeIvvuPilla song recording with @SilambarasanTR_ 🤩
Stay tuned… Full song on DEC 5th!💕#ThankYouSTR ~ #STRFor18Pages 🎤#18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @lightsmith83 @NavinNooli @adityamusic pic.twitter.com/cBLvnFF3JU
— BA Raju's Team (@baraju_SuperHit) November 29, 2022
Read Also : Bandla Ganesh | రాజకీయాలతో చాలా నష్టపోయా.. హాట్ టాపిక్‌గా బండ్ల గణేశ్ కామెంట్స్
Read Also :Boss Party making Video | వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ వీడియో
Read Also :Yashoda | యశోద సినిమా వివాదానికి లైన్ క్లియర్.. నిర్మాత క్లారిటీ