యువ హీరో నిఖిల్ గూఢచారి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘స్తె’. గ్యారీ బీహెచ్ దర్శకుడు. ఎడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా నిఖిల్ పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో చేతిలో ట్రాన్స్‌మీటర్‌తో మంచు పర్వతాల మీద ఓ రహస్య ప్రదేశంలో సంచరిస్తూ కనిపిస్తున్నాడు నిఖిల్. ఆయుధాలు ధరించి శత్రువులను వేటాడటానికి రంగంలో దిగిన గూఢచారిగా ఆయన లుక్స్ ైస్టెలిష్‌గా ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆర్యన్‌రాజేష్, ఐశ్వర్యమీనన్, అభినవ్ గోమటం, మకరంద్ దేశ్‌పాండే, సన్యా ఠాకూర్, జిషుసేన్ గుప్తా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జూలియన్ అమరు ఎస్ట్రాడా, సంగీతం: శ్రీచరణ్ పాకాల, రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి, సీఈఓ: చరణ్‌తేజ్ ఉప్పలపాటి, కథ, నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి, దర్శకత్వం, ఎడిటర్: గ్యారీ బీహెచ్.