Karthikeya-2 Movie | అప్పుడే ఓటీటీలోకి ‘కార్తికేయ-2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Karthikeya-2 On OTT | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో కార్తికేయ-2 ఒకటి. ఎన్నో వాయిదాల తర్వాత ఆగస్టు 12న విడుదలై ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై ఘన విజయం సాధించింది. బహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.120కోట్ల గ్రాస్‌ను రూ.60 కోట్లకు పైగా షేర్‌ను సాధించి కంటెంట్ ఉన్న సినిమాలకు అడ్డేది అని నిరూపించింది. కాగా కార్తికేయ-2 ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమౌవుతున్నట్లు తెలుస్తుంది.
కార్తికేయ-2 చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 30నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు. కాగా ఈ సినిమా మలయాళ వెర్షన్ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలలో అత్యధిక ప్రాఫిట్స్ వచ్చిన రెండో సినిమాగా కార్తికేయ-2 నిలిచింది.
Read Also:
Karthikeya-2 | ముప్పై రోజుల్లో ‘కార్తికేయ-2’ అన్నికోట్లు కలెక్ట్ చేసిందా?
Yo Yo Honey Singh | విడాకులు తీసుకున్న యో యో హనీసింగ్ జంట.. భరణంగా అన్ని కోట్లు ఇచ్చాడా?
RC16 | రామ్‌చరణ్-గౌతమ్ తిన్ననూరి ‘RC16’ కాన్సిల్ అయిందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

