RC16 | రామ్‌చరణ్-గౌతమ్ తిన్ననూరి ‘RC16’ కాన్సిల్ అయిందా?
RC16 Shelved | ‘ఆర్ఆర్ఆర్’తో జాతీయ స్తాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్‌చరణ్. ప్రస్తుతం ఈయన లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘RC15’ చేస్తున్నాడు. ఇప్పటికే సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల కానుంది. చిత్రం నుండి లీకైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్, ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నట్లు గతంలోనే ప్రకటన వచ్చింది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సంస్థ నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రం కాన్సిల్ అయినట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కాన్సిల్ అయినట్లు టాక్. గౌతమ్ తిన్ననూరి ఇటీవలే ‘జెర్సీ’ చిత్రాన్ని బాలీవుడ్లో షాహిద్ కపూర్‌తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్టు కాలేదు. దాంతో రామ్‌చరణ్ సందిగ్ధంలో పడ్డాడు. టాలీవుడ్ వరకు ఒకే కానీ, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘Rc16’ను హ్యండిల్ చేయగలడా అని అనుకున్నాడట. దాంతో గౌతమ్ తిన్ననూరితో సినిమా క్యాన్సిల్ చేసి వేరే డైరెక్టర్‌ను వెతికే పనిలో ఉన్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే రామ్‌చరణ్ ‘మఫ్టీ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన నార్తన్ (కన్నడ దర్శకుడు)ని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

