Karthikeya-2 Movie | నిఖిల్ ‘కార్తికేయ-2’ హిందీ టీజర్ విడుదల
Karthikeya-2 Hindi Teaser | యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘కార్తికేయ-2’ ఒకటి. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.6 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం రూ.20 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది.
ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా హిందీ టీజర్‌ను విడుదల చేశారు. ఇక ఇటీవలే విడుదలైన తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ముందుగా జూలై 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అదే రోజున నాగచైతన్య ‘థాంక్యూ’ విడుదలవుతుండటంతో కార్తికేయ-2ను పోస్ట్ పోన్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

