నిఖిల్ హీరోగా, సుధీర్‌వర్మ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటైర్టెనర్కి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నిఖిల్ ైస్టెలిష్‌గా, రుక్మిణీ వసంత్ గ్లామరస్‌గా.. ఇద్దరూ కలిసి నడుస్తూ ఈ లుక్‌లో కనిపిస్తున్నారు. సుధీర్‌వర్మ, నిఖిల్ కాంబినేషన్లో గతంలో వచ్చిన స్వామిరారా, కేశవ చిత్రాలను మించేలా ఈ సినిమా ఉంటుందని, కచ్ఛితంగా వీరిద్దరికీ ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: కార్తీక్, నేపథ్య సంగీతం: సన్నీ.ఎం.ఆర్, సహనిర్మాతలు: యోగేష్ సుధాకర్, సునీల్ షా, రాజా సుబ్రహ్మణ్యం, సమర్పణ: బాపినీడు, నిర్మాణం: ఎస్.వి.సి.సి.ప్రొడక్షన్స్.