నిఖిల్‌కుమార్ కథానాయకుడిగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రైడర్’. చంద్రమనోహరన్ నిర్మాత. కాశ్మీర పరదేశి కథానాయిక. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమైంది. క్రీడా నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సందేశం, ప్రేమ అంశాల కలబోతగా అందరిని మెప్పిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. దత్తన్న, అచ్యుత కుమార్, రాజేష్ నటరంగ, శోభరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీషా కుడువల్లి, సంగీతం: అర్జున్ జన్య, రచన: నంధ్యాల రవి, విజయ్‌ప్రకాష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌కుమార్ కొండా.