Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
Niharika Konidela | ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెలకు చెందిన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’, ‘మాక్సిమం సిటీ స్టూడియోస్’ సంస్థలు సంయుక్తంగా నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Niharika Konidela | ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెలకు చెందిన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’, ‘మాక్సిమం సిటీ స్టూడియోస్’ సంస్థలు సంయుక్తంగా నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయగా, బుధవారం నాడు దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రుద్ర అత్రి దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ హీరోలుగా నటిస్తుండగా, ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఇందులో ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
విదేశాల్లో చదువుకోవాలని కలలు కనే ఓ కుర్రాడు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి గ్యాబ్లింగ్ (జూదం) వైపు అడుగులు వేయడం, ఆ తర్వాత అతని జీవితంలో ఎదురైన ఊహించని పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా అత్యంత ఆసక్తికరంగా సాగనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ అలాగే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గ్యానీ సంగీతం అందిస్తుండగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్రినాథ్ వర్మ, శ్రియా కొంతం, నిర్మల్, జేడీ చక్రవర్తితో పాటు శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
Konda Surekha | నిన్న ఈనాడు, నేడు కొండా సరేఖ..! కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పిన మాజీ మంత్రి
Radhika Apte | ప్రకృతిని నమ్ముతాను.. దేవుడిని కాదు: రాధికా ఆప్టే
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

