Madraskaaran | టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) సినిమాలకు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం మద్రాస్ కారన్ (Madraskaaran). RDX లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన మలయాళ నటుడు షాన్ నిగమ్ (Shan Nigham) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కలైయరసన్, ఐశ్వర్య దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు వాలిమోహన్ దాస్(Valilmohan Das) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పొంగల్ కానుకగా.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. మద్రాస్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.