Nihal Kodati and Surya Srinivas | టాలీవుడ్ లో వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న చిత్రాల జాబితాలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేరడానికి సిద్ధమవుతోంది. ప్రేక్షకులను కట్టిపడేసేలా నూతన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. యువ నటులు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్, క్యారెక్టర్ ఆర్టిస్టులు కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, తులసి, హర్షిత బండ్కమూరి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.
సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను పెంచేశాయి. కేవలం యాక్షన్ మరియు థ్రిల్లర్ అంశాలకే పరిమితం కాకుండా, ఇందులో చక్కటి వినోదం, హ్యూమర్ ఎలిమెంట్స్ కూడా జోడించడంతో ఆడియన్స్ లో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రమోషనల్ కంటెంట్ ప్రతి దశలోనూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ వస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో ఆకర్షణీయమైన అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిత్రంలోని ‘ఓయ్ ఓయ్’ అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ పాటకు ఎంతో క్యాచీ అయిన ట్యూన్ అందించడంతో పాటు, స్వయంగా తన మధురమైన గొంతుతో ఆలపించి శ్రోతలను అలరించారు. ఇక ప్రముఖ గీత రచయిత రెహమాన్ అందించిన సాహిత్య విలువలు ఈ పాటకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. తెరపై పాత్రల స్వభావాన్ని, వాటి మధ్య ఉండే కెమిస్ట్రీని ఆసక్తికరంగా హైలైట్ చేసేలా ఈ పాటను చాలా కలర్ ఫుల్ గా విజువల్స్ తో తీర్చిదిద్దారు.
అన్ని హంగులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న అత్యంత గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బలమైన సాంకేతిక నిపుణుల బండలంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పీఆర్వో బాధ్యతలను తేజస్వీ సజ్జా విజయవంతంగా నిర్వహిస్తున్నారు.