Nidhhi Agerwal | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో, చిత్రబృందం ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. ట్రైలర్ రిలీజ్‌కు ముందు ఈ సినిమాకి సంబంధించిన పలు పోస్టర్స్ విడుదల చేయడమే కాకుండా ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇక ఈ రోజు 11:1.గం.లకి చిత్ర ట్రైలర్ విడుదల కానుండడంతో ఈ ట్రైలర్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర సినిమాకు మరో హైలైట్‌గా మారనుందని సమాచారం. ప్పటివరకు ఆమె చేసిన పాత్రలతో పోలిస్తే, ఈ సినిమాలో నిధి పూర్తిగా కొత్త లుక్‌తో ప్రేక్షకుల కట్టిపడేస్తుందని మేకర్స్ అంటున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండడంతో పాటు, భారీ స్క్రీన్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంటుందట. “కొత్త నిధిని చూడటానికి సిద్ధంగా ఉండండి” అనే ట్యాగ్‌లైన్‌తో ఆమె పాత్రపై క్యూరియాసిటీ పెంచింది చిత్ర బృందం. నిధి గెటప్, మేకోవర్, పాత్ర ధోరణి అన్నీ ఈసారి అభిమానులను ఆశ్చర్యపరచేలా ఉండనున్నాయి. ఈ సినిమా మొఘల్ సామ్రాజ్య కాలాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించబడింది. సామాన్యుల హక్కుల కోసం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే బందిపోటు యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు.
ప్రారంభంలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సినిమాను రూపొందించినప్పటికీ, తర్వాత దర్శకత్వ బాధ్యతలు ఏఎం జ్యోతికృష్ణ స్వీకరించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు సంగీత ప్రియులను మెస్మరైజ్ చేశాయి. పాటలకు వచ్చిన స్పందన సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ మాస్ యాక్షన్‌తో పాటు, నిధి అగర్వాల్ కొత్త రూపం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనుంది. మరి కొద్ది నిమిషాలలో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు.