మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి ఇండియన్ 2 (Indian 2). బాక్సాపీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టిన కమల్ హాసన్ (kamal haasan), శంకర్ (Shankar) కాంబినేషన్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడు సందడి చేస్తుందా..? అని క్యూరియాసిటీతో ఉన్నారు సినీ జనాలు. తాజాగా ఇండియన్ 2 షూటింగ్ ప్లాన్‌కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.
ఇండియన్ 2 చిత్రీకరణను ఆగస్టు 24 నుంచి షురూ చేయాలని ఫిక్స్ అయ్యాడట శంకర్. ఈ స్టార్ డైరెక్టర్ చిన్న షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేశాడని ఇన్సైడ్ టాక్. ఈ షెడ్యూల్ షూట్లో మెయిన్ యాక్టర్లు ఉండరని టాక్. మరి దీనిపై ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే క్లారిటీ రానుంది. లైకాప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్ 2 ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని ఇతర కీ రోల్స్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం రాంచరణ్ హీరోగా చేస్తున్న ఆర్సీ 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు శంకర్. తాను షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్టు ఇప్పటికే కాజల్ నెట్టింట్లో అప్డేట్ కూడా ఇచ్చేసింది.