Revolt Of Bheem from RRR | ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల తేదీ ఇంకా ఎంతో దూరంలో లేదు. మరో 15 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో మరింత జోరు పెంచింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. కొమరం భీమ్‌కు సంబంధించిన ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా.. కీరవాణి తనయుడు కాలభైరవ పాడాడు. పూర్తిగా తెలంగాణ యాసలో సాగిన ఈ పాట ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సీరియస్‌గా ఉన్న ఫోటో అభిమానులకు బాగా నచ్చేసింది.
మరోవైపు కాలభైరవ గాత్రం కూడా అద్భుతంగా ఉంది. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాట లైన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. డిసెంబర్ 24న పూర్తి పాట విడుదల కానుంది. కచ్చితంగా ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది అని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇద్దరు హీరోల అభిమానులు సాటిస్ఫై అయ్యేలా ఎవరికి వాళ్లకు సపరేట్గా పాటలు పెట్టాడు రాజమౌళి. సినిమా ఎంత కథ ప్రధానంగా సాగిన కూడా ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉన్నప్పుడు కచ్చితంగా అభిమానుల మధ్య ఈగో క్లాష్ అవుతుంది.
అందుకే చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరి కోసం ప్రత్యేకంగా పాటలు చిత్రీకరించాడు రాజమౌళి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్ పాట విడుదల అవుతుంది. త్వరలోనే చరణ్ కోసం ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు పాత్రపై చిత్రీకరించిన పాట కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 7న ట్రిపుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల థియేటర్స్‌లో విడుదల కానుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 600 కోట్ల వరకూ జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR | బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రిపుల్ ఆర్తో పాటు ఆ సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్న రాజమౌళి..
మలయాళంలో డబ్బింగ్ చెప్పకపోడానికి కారణం అదేనంటున్న తారక్..
NTR: ఎన్టీఆర్ వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే..!