Kanaka Durga | భక్తి, యాక్షన్ కలబోతగా అల్లరి నరేష్ ‘కనకదుర్గ’.. గ్రాండ్‌గా లాంచ్ అయిన మూవీ!
Allari Naresh | అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కనకదుర్గ' శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది.
Kanaka Durga | అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కనకదుర్గ’ శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ మరియు టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ నుంచి ప్రముఖులు విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిత్ర యూనిట్‌కు క్లాప్ కొట్టారు. దిల్ రాజు కుటుంబ సభ్యులు తేజస్విని, హన్షిత రెడ్డితో పాటు నిర్మాత స్వప్న దత్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు.
ఈ సినిమాతో అల్లరి నరేష్ తన కెరీర్లో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నరేష్, ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి చిత్రాలతో తనలోని నటుడిని మరో కోణంలో ఆవిష్కరించారు. ఇప్పుడు ‘కనకదుర్గ’తో ఒక హై-ఇంటెన్సిటీ డివోషనల్ యాక్షన్ డ్రామాను మన ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. జీవితంలో తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఒక వ్యక్తి, దైవ శక్తిని కలిసినప్పుడు అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే ఆసక్తికరమైన అంశంతో ఈ కథ సాగుతుంది. బి.వి.ఎస్. రవి ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కాజల్ చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సుబ్బరాజు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మికత మేళవింపుతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ నరేష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
New Beginnings… New Adventures !
Glimpses from #AllariNaresh starrer #KanakaDurga Movie Launch
Produced by #ApplauseEntertainment#TempleTownPictures #SameerNair #AjitThakur @bvsravi22
Directed by @PradeepMaddali #PradeepMaddali pic.twitter.com/01TFaVro2O
— BA Raju’s Team (@baraju_SuperHit) April 7, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

