శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘నెట్వర్క్’. సతీష్‌చంద్ర నాదెళ్ల దర్శకుడు. రమ్య సినిమా పతాకంపై లావణ్య యన్ఎస్, ఎంజీ జంగం నిర్మించారు. నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని, ఆన్లైన్ డేటింగ్, గ్యాంబ్లింగ్, ఇన్ఫ్లూయెన్సర్స్ అంశాల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుందని, కథలోని మలుపులు ఉత్కంఠకు గురిచేస్తాయని మేకర్స్ తెలిపారు. మాస్టర్ అవ్యుక్త్ వల్లూరి, తాగుబోతు రమేష్, , సమ్మెట గాంధీ, జోష్ రవి తదితరులు నటించిన ఈ సిరీస్‌కు శేఖర్‌చంద్ర సంగీతాన్నందించారు.