Aishwarya Rai | బాలీవుడ్ అగ్ర నటి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ఈ మధ్య తెగ వార్తలలో నిలుస్తుంది. తన భర్త అభిషేక్ నుండి విడాకులు తీసుకుందని కొందరు జోరుగా ప్రచారాలు చేశారు. దానిపై ఐష్ ఏ నాడు స్పందించింది లేదు. కొద్దిరోజులుగా ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితం ఎన్ని కథనాలు వస్తున్నా ఆమె నోరు విప్పడంలేదు. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయి అని, అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు రావడం మనందరికి తెలిసిందే.
అయితే అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ ల ముద్దుల కూతురు ఆరాధ్య 2011లో జన్మించింది. ఈ చిన్నారి ఇప్పుడు ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. చదువులో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నారి పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. అయితే మొన్నటి వరకు చిన్న పిల్లలా కన్పించిన ఆరాధ్య ఇప్పుడు చాలా పెద్దదైంది. తల్లి మాదిరిగా చాలా గ్లామర్‌గా కూడా కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా ఐశ్వర్య, ఆరాధ్య కు సంబంధించిన ఓ వీడియో వైరల్ కాగా, ఇందులో ఆరాధ్య లుక్‌కి సంబంధించి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో శ్రీదేవి తన ముక్కుకి సర్జరీ చేయించుకొని అందంగా మారగా, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యకి కూడా సర్జరీ చేయించారని , 13 ఏళ్ల వయస్సులో ఆమెకు సర్జరీ చేయించడం అవసరమా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ మాత్రం ఐష్ కూతురు తన తల్లిని మించిన అందంతో కనిపిస్తుంది. త్వరలో హీరోయిన్ కావడం ఖాయం అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఐశ్వర్యరాయ్ కూడా ఈ వయస్సులో చాలా గ్లామర్‌గా కనిపిస్తుంది. రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరైన ఈ అమ్మడు తన బాడీ షేమింగ్ గురించి మాట్లాడిన వారికి గట్టిగా ఇచ్చి పడేసింది. మరి ఇప్పుడు తన కూతురిపై వస్తున్న విమర్శలకి సమాధానం చెబుతుందా లేదా చూడాలి.