కార్తికేయ గుమ్మడికొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ, ముప్పానేని నిర్మాత. ఈ చిత్రంలో కార్తికేయ సరసన డిజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. సోమవారం ఆమె జన్మదినం సందర్భంగా చిత్రంలో నేహా లుక్ను విడుదల చేసింది చిత్రబృందం.
దర్శకుడు మాట్లాడుతూ ‘సంప్రదాయబద్దంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి చిత్రగా నేహాశెట్టి ఈ చిత్రంలో కనిపిస్తుంది. పైకి బార్బీ బొమ్మలా కనిపించినా లోపల ఆర్టీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సంగీతం: మణిశర్మ.