మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ చిత్రం చిరుత సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇందులో చరణ్‌కి జోడీగా అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ నటించింది. సినిమాలో చరణ్‌తో ఘాటు రొమాన్స్ చేస్తూ అందాలు ఆరబోసి ప్రేక్షకుల మనసులు దోచుకుంది.ఈ అమ్మడి జోరు చూసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుందని అప్పుడు అందరు అనుకున్నారు. కాని నేహా తెలుగులో పెద్దగా రాణించలేక బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కూడా ఈ అమ్మడికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు.
తెలుగు, తమిళ్, పంజాబీ, మాండరిన్ భాషల్లో పలు చిత్రాలు చేసిన నేహా శర్మ వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది.అయితే ఈ అమ్మడు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారానే హాట్ టాపిక్‌గా మారుతుంది.ఎప్పటికప్పుడు తనలో దాగి ఉన్న అందాలను బహిర్గతం చేస్తూ కుర్రకారుకి కంటిపై కనుకు లేకుండా చేస్తుంది. తాజాగా బ్లూ కలర్ షర్ట్, ప్యాంట్ ధరించిన నేహా.. షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలతో పాటు నడుము అందాలు కూడా చూపిస్తూ కేక పెట్టిస్తుంది. నేహా పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.