సత్యరాజ్, వశిష్ట ఎన్.సింహా, సాంచిరాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకుడు. విజయపాల్‌రెడ్డి అడిదల నిర్మాత. అగ్ర దర్శకుడు మారుతి సమర్పకుడు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని ‘నీవల్లే..’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. రఘురాం రాసిన ఈ పాటకు ఇంప్యూజన్ బ్యాండ్ స్వరపరచగా సిద్ శ్రీరామ్ ఆలపించారు. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఈ పాట సాగింది. ఉదయభాను, సత్యం రాజేష్, వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేష్‌రెడ్డి.