టాలీవుడ్ యాక్టర్ నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న తాజా చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో ఢిల్లీ భామ మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తోపాటు కనుల చాటు మేఘమా పాటకు మంచి స్పందన వస్తోంది.
తాజాగా మరో సాంగ్ అప్డేట్ అందించారు. నీతో ఈ గడిచిన కాలం అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ.. పోస్టర్ లాంఛ్ చేశారు మేకర్స్. తాజా మెలోడి ట్రాక్ నాగశౌర్య, మాళవికా నాయర్ కెమిస్ట్రీతో సంగీత ప్రియుల్ని ఆకట్టుకోవడం పక్కా అని పోస్టర్‌తో హింట్ ఇచ్చేశారు మేకర్స్.
ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావ్, అర్జున్ ప్రసాద్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మార్చి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
A Smile like Melody #NeethoeeGadichinaKalam
Releasing tomorrow at 6️⃣ PM😍🎼Stay Tuned⏳️#PAPA@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/V5yX45d6HZ
— BA Raju's Team (@baraju_SuperHit) March 8, 2023
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్..
Read Also :
Rana Naidu | జాన్వీకపూర్ సమస్యను పరిష్కరించిన రానా.. ట్రెండింగ్‌లో రానా నాయుడు వీడియో
Dasara | ముంబైలో దసరా టీంతో నాని హోలీ వేడుకలు.. ట్రెండింగ్‌లో స్టిల్స్, వీడియో
Rama Banam | గోపీచంద్ రామబాణం నుంచి హైదరాబాదీ భామ ఫస్ట్ లుక్
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..