కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు టాలీవుడ్ యాక్టర్ నాగశౌర్య (Naga Shaurya). ఈ యువ హీరో నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీనివాస్ అవసరాల కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి నీతో ఈ గడిచిన కాలం అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.
భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాటను కళ్యాణి మాలిక్ కంపోజిషన్‌లో గీతామాధురితో కలిసి స్వయంగా ఆలపించాడు. అందమైన లొకేషన్లలో వర్షంలో నాగశౌర్య, మాళవికా నాయర్ మధ్య సాగే తాజా మెలోడి ట్రాక్ ఫీల్ గుడ్ థీమ్‌తో మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావ్, అర్జున్ ప్రసాద్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మార్చి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన కనుల చాటు మేఘమా నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది.
నీతో ఈ గడిచిన కాలం..
Feel the vibe of
Magical Melody #NeethoeeGadichinaKalam
Out now😍🎼Watch Full lyrical👇https://t.co/aRUeMLm9cb#PAPA#PAPAOnMarch17@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla@PSrividya53 pic.twitter.com/9wpLw1qPnz
— People Media Factory (@peoplemediafcy) March 9, 2023
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్..
కనుల చాటు మేఘమా సాంగ్