NBK 112 |బాలయ్య-కొరటాల మూవీకి ముహూర్తం ఫిక్స్.. లాంచ్ కార్యక్రమానికి అతిథులు వీరే..!
NBK 112 | నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK112’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 25న విజయవాడ సమీపంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
NBK 112 | నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK112’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 25న విజయవాడ సమీపంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన సినిమా మొదటి షాట్‌కు క్లాప్ కొట్టనున్నారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్ హీరో బాలకృష్ణ, సందేశాత్మక కథలకు కేరాఫ్‌గా నిలిచిన కొరటాల శివ తొలిసారి కలిసి పనిచేయడం ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘దేవర’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొరటాల, బాలయ్య కోసం పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ డైలాగ్ డెలివరీ, మాస్ యాక్షన్‌తో పాటు కొరటాల శివ మార్క్ సామాజిక అంశాలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలో ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నారా లోకేష్ ముఖ్య అతిథిగా రావడం వల్ల ఈ కార్యక్రమానికి రాజకీయంగానూ ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. బాలయ్య అల్లుడైన లోకేష్ క్లాప్ కొట్టడం నందమూరి అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఒక బలమైన కమ్యూనిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో రూపొందనుందట. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి చేసే పోరాటాన్ని బాలయ్య స్టైల్ మాస్ ఎలిమెంట్స్‌తో కొరటాల శివ చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, సంగీత దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను జూన్ 25న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ ఓపెనింగ్ అందుకునే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

