పెళ్లి వేదిక మహాబలిపురం?
గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్, అగ్ర కథానాయిక నయనతార జూన్ 9న పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని తొలుత వార్తలొచ్చాయి.
గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్, అగ్ర కథానాయిక నయనతార జూన్ 9న పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని తొలుత వార్తలొచ్చాయి. గత నెలలో ప్రేమికులిద్దరూ తిరుమల సందర్శించడంతో అక్కడే వివాహం చేసుకుంటారని అందరూ అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వివాహ వేదికలో మార్పు జరిగినట్లు తెలిసింది. చెన్నైకి దగ్గరలోని మహాబలిపురం వీరి వివాహానికి వేదిక కానున్నట్లు సమాచారం. వీరిద్దరి డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. విఘ్నేష్-నయన్ తమ సన్నిహితులకు ఈ ఆహ్వాన పత్రికను పంపిచారు.
అందులో పెళ్లి వేదికగా మహాబలిపురంను పేర్కొన్నారు. ‘జూన్ 9న మా కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించండి’ అని ఆహ్వాన పత్రిక ద్వారా కోరారు. విఘ్నేష్‌శివన్ దర్శకత్వం వహించిన ‘నానున్ రౌడీదాన్’ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట మధ్య ప్రేమ చిగురించింది. ఆరేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

