Nayanthara | నయనతార మీడియా ముందుకు రావడమే అరుదు. సినిమా ప్రమోషన్లలో కూడా ఆమె పాల్గొనరు. ‘జవాన్’ ప్రమోషన్‌కే ఆమె హ్యాండిచ్చేశారు. కానీ రీసెంట్గా చెన్నయ్‌లో అనుకోకుండా మీడియాకు చిక్కారు నయన్. ఈ సందర్భంగా ‘జవాన్’ గురించి మాట్లాడారు. “నేను చిన్నప్పట్నుంచీ షారుఖ్ వీరాభిమానిని. ‘దిల్వాలే దిల్హానియా లేజాయింగే’ ఓ యాభై సార్లు చూసుంటా.
ఆయన్ను డైరెక్ట్‌గా చూస్తే చాలు అనుకునేదాన్ని. ఓ ఫంక్షన్లో ఆయన్ను కలిసే అవకాశం దొరికింది. అప్పుడు ఆయన నాతో ‘నిన్ను బాలీవుడ్‌కి తీసుకెళ్లిపోతా..’ అంటూ సరదాగా అన్నారు. ఆ సమయంలో బహుశా తథాస్తు దేవతలు ‘తథాస్తు’ అన్నారేమో. ఆయన సినిమాతోనే బాలీవుడ్లో అడుగుపెట్టా. బాలీవుడ్లో నా తొలి సినిమా ఇంత విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది.” అంటూ చెప్పుకొచ్చారు నయన్. మరి బాలీవుడ్లో కంటిన్యూ అవుతారా? అనడిగితే- “ కేరక్టర్ నచ్చితే ఏ భాషలోనైనా చేస్తా..” అని సింపుల్‌గా సమాధానమిచ్చేశారు నయనతార.