Nayanathara O2 Movie On OTT | హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ నయనతార. ఇప్పుడున్న హీరోయిన్లలో నయనతార చేసినన్ని ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను మరెవరు చేయలేరు. ‘నేట్రికన్’, ‘అనామిక’, ‘కర్తవ్యం’, ‘మయూరి’, ‘కోకోకోకిల’ వంటి మహిళా ప్రధాన చిత్రాలతో ఇండస్ట్రీలో పత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఈమె నటించిన మరో ఫీ మేల్ సెంట్రిక్ చిత్రం ‘O2’. జీఎస్.విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్ విడుదలను స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.
థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో నయనతార ఎనిమిదేళ్ళ బాబుకు తల్లిగా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. రిత్విక్, లీనా, మనోహర్, అడకులం మురుగదాస్ కీలకపాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.