Naveen Polishetty | ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. కష్టాన్ని నమ్ముకుని ఇండస్ట్రీలో పైకొచ్చిన నటులలో నవీన్ ఒకడు. ‘నేనొక్కడినే’ సినిమా తర్వాత దాదాపు ఐదేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో హీరోగా మారాడు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్‌తో పాటు క్రిటిక్స్ నుండి గొప్ప ప్రశంసలు అందుకుంది. అయితే 2019లో వచ్చిన ‘జాతి రత్నాలు’ మూవీ నవీన్ పొలిశెట్టి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సినిమాతో టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నవీన్ రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు.
అందులో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న రోమ్-కామ్ ఒకటి. అనుష్క శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నవీన్ సిద్ధూ పొలిశెట్టి పాత్రలో నటిస్తున్నాడు. అనుష్క ఈ సినిమాలో చెఫ్‌గా కనిపించనుంది. ఇటీవలే రిలీజైన ఈమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
ఓ యంగ్ కుర్రాడికి ఓ మిడిల్ ఏజ్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. దీనితో పాటుగా నవీన్ ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తున్నాడు.
Happy Birthday 🎂 to the young sensation 💥#NaveenPolishetty !
Introducing 'Sidhu Polishetty' aka @NaveenPolishety #AnushkaShetty #MaheshBabuP @radhanmusic #NiravShah #RajeevanNambiar @UV_Creations #ProductionNo14 #NaveenPolishetty3 #Anushka48 pic.twitter.com/k04fxy7FOL
— UV Creations (@UV_Creations) December 26, 2022