Nani30 Announcement | నేచురల్ స్టార్ నాని ఫలితం ఎలా ఉన్న వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన ‘అంటే సుందరానికీ’ రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఈ సినిమాకు మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ వచ్చిన, కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. నాని నటించిన గత ఐదారు చిత్రాలు కూడా కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఈయన ఒక భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో నాని తన జానర్‌ను వదిలేసి ‘దసరా’ వంటి అవుట్ అండ్ అవుట్ మాస్ కథతో ప్రేక్షకులు ముందుకు రావడనికి సిద్ధమయ్యాయి. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇదిలా ఉంటే నాని తదుపరి సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది.
నాని తన తదుపరి సినిమాను వైరా ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లో చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి విషయాలను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న సాయంత్రం 4గంటల 5నిమిషాలకు ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌ను గమనిస్తే నాని ఈ మూవీలో ఫోటో గ్రాఫర్‌గా పనిచేయనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నాని 5గురు దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ప్రస్తుతం నాని నటిస్తున్న ‘దసరా’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. మొదటి సారి నాని ఫుల్ లెంగ్త్ ఊరమాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో నాని అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.