Actor Trisha | త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మన్సూర్ అలీ ఖాన్‌పై జాతీయ మహిళా కమిషన్ చర్యలు
National Commission for Women | ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) కి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషపై మన్సూర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్ సోమవారం స్పందించింది.
National Commission for Women | ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) కి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషపై మన్సూర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్ సోమవారం స్పందించింది. మన్సూర్ అలీ ఖాన్‌పై ఐపీసీ సెక్షన్ 509 బి, ఇతర సంబంధిత చట్టాలను ఉపయోగించి కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. మహిళలపై అటువంటి వ్యాఖ్యలను ఖండించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.
ఇంతకీ ఏం జరిగింది అంటే ?.. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. రేప్ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు. అంటూ మన్సూర్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద, మలయాళ నటి మాళవిక మోహన్, దర్శకుడు లోకేష్ కానగరాజ్, ఆగ్రహం వ్యక్తం చేశారు.
The National Commission for Women is deeply concerned about the derogatory remarks made by actor Mansoor Ali Khan towards actress Trisha Krishna. We’re taking suo motu in this matter directing the DGP to invoke IPC Section 509 B and other relevant laws.Such remarks normalize…
— NCW (@NCWIndia) November 20, 2023
ఇక తాజాగా ఈ ఘటనపై త్రిష ఘాటుగా స్పందించింది. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరమైనదిగా అనిపిస్తోంది. అతనిలాంటి దయనీయ వ్యక్తితో ఇప్పటివరకు స్క్రీన్ స్పేస్‌ను ఎప్పుడూ పంచుకోనందుకు నేను అదృష్టవంతురాలిని. నా మిగిలిన కెరీర్ లో అలాగే నా సినిమాలో అతడు లేకుండా చూసుకుంటాను. మన్సూర్ అలీ ఖాన్ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుంది. అంటూ త్రిష రాసుకోచ్చింది. ఇక ఈ విషయంపై త్రిషకు పలువురు సినీతారలు మద్దతు తెలుపుతున్నారు.
ఇక పరిస్థితులు చేజారడంతో మన్సూర్ ఈ విషయంపై మళ్లీ స్పందిస్తూ.. ‘త్రిష అంటే నాకు చాలా గౌరవం.. నేనేదో సరదాగా అన్నాను. ఆ మాటలు ఇంత వివాదానికి దారి తీస్తాయనుకోలేదు’ అంటూ క్షమాపణ కోరాడు. మాట పెదవి దాటితే తిరిగి తీసుకోలేం. ఈ విషయం ఇప్పటికైనా మన్సూర్ అలీఖాన్ గ్రహిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

