Janhvi Kapoor | ఏం జరిగిందో అర్థం కాలేదు: జాన్వీకపూర్
కొద్దిరోజుల క్రితం ఫుడ్‌పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయింది అగ్ర కథానాయిక జాన్వీకపూర్. చెన్నై నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకొని చికిత్స తీసుకొని కోలుకుంది. ఆసుపత్రిలో ఉన్న మూడురోజులు భయంగా గడిచాయని, ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదని జాన్వీకపూర్ చెప్పింది.
Janhvi Kapoor | కొద్దిరోజుల క్రితం ఫుడ్‌పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయింది అగ్ర కథానాయిక జాన్వీకపూర్. చెన్నై నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకొని చికిత్స తీసుకొని కోలుకుంది. ఆసుపత్రిలో ఉన్న మూడురోజులు భయంగా గడిచాయని, ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదని జాన్వీకపూర్ చెప్పింది. ఈ సంఘటన తర్వాత పని కంటే ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఆసుపత్రిలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి జాన్వీకపూర్ మాట్లాడుతూ..
‘గత కొన్ని వారాలుగా ఒక్కరోజు విరామం లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా. పాట షూటింగ్ కోసం చెన్నై వెళ్లినప్పుడు బయట రెస్టారెంట్స్‌లో ఎక్కువగా తిన్నాను. దాంతో ఒక్కసారిగా సిక్ అయ్యాను. కడుపులో భరించలేనంత నొప్పి కలిగింది. ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో మొత్తం నీరసించిపోయా. ఒకరి సహాయం లేకుండా నడవలేకపోయా. దాంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. మూడు రోజుల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నా. ఇకముందు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

