Telangana Budget | హార్టికల్చర్‌కు 737 కోట్లు.. పశుసంవర్ధక రంగానికి వెయ్యి కోట్లు
2024-25 ఆర్థిక సంవత్సవరానికిగాను తెలంగాణ బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు, పశుసంవర్ధక రంగానికి రూ.1980 కోట్లు ప్రతిపాదించారు.
హైదరాబాద్: 2024-25 ఆర్థిక సంవత్సవరానికిగాను తెలంగాణ బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు, పశుసంవర్ధక రంగానికి రూ.1980 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 12.12 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటల సాగు ద్వారా 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎన్ఎంఈఓ ఓపీ (NMEO-OP) పథకం కింద ఆయిల్ పామ్‌సాగు రైతులకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు.
2024-25లో రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్గు చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే 77,857 ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరుగగా, 23,131 ఎకరాలకి అనుమతులు కూడా ఇచ్చామన్నారు. వచ్చిన మొత్తం రిజిస్ట్రేషన్లకి ఈ నెలలోనే ప్లాంటేషన్ మరియు డ్రిప్ అనుమతులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
పశుసంవర్ధక రంగానికి వెయ్యి కోట్లు
‘పాడిపశువుల పెంపకం గ్రామీణ ప్రజానీకానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది. పాలు, మాంసం, గుడ్లు ప్రజానీకానికి పోషణ అందించడంతో పాటు, అదనపు ఆదాయం ఇస్తాయి. ఇతర అనుబంధ రంగాలైన చేపలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ఎంతో మందికి జీవనోపాధికల్పిస్తాయి. ఈ రంగం గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పిస్తూ, అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది. పాల ఉత్పత్తి రంగంలో 62 శాతం వాటా చిన్న, సన్నకారు మరియుభూమిలేని పేదలదే. వారు రాష్ట్రంలోని పశుసంపదలో 70 శాతం వాటా పొంది ఉన్నారు. ఈ రంగంలో రాష్ట్రం 326.39 లక్షల పశుసంపదతో దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది.
పశుసంవర్ధక రంగానికి ఈ బడ్జెట్లో రూ.1,980 కోట్లు ప్రతిపాదిస్తున్నాం’ అని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

