Malli Pelli Movie Teaser | ఐదేళ్ల క్రితం వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాలో తొలిసారి భార్య, భర్తలుగా నటించారు నరేష్, పవిత్ర. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ షికారు చేశాయి. ఇక కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న ఈ ఇద్దరూ కలిసి లిప్‌కిస్ చేసుకున్న వీడియోను రిలీజ్ చేసి ఒక్క సారిగా సంచలనం అయ్యారు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. అంతటితో ఆగకుండా గతనెల పెళ్లి వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోకు ఒక పవిత్ర బంధం, రెండు మనుసులు, మూడు ముళ్లు, ఏడడుగులు, మీ ఆశిస్సులు కోరుకుంటూ పవిత్ర నరేష్ అంటూ కాప్షన్ ఇచ్చాడు. దాంతో ఆ వీడియో కూడా క్షణాల్లోనే వైరల్ అయింది.
అయితే అది సినిమాలోని వీడియో అని అప్పుడే క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరూ కలిసి చేస్తున్న ఓ సినిమాలోని సన్నివేశాన్ని రిలీజ్ చేశారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అదే నిజం చేస్తూ నాలుగు వారాల ముందు ‘మళ్లీ పెళ్లీ’ అంటూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దాంతో లిప్‌లాక్ వీడియో, పెళ్లి వీడియో రెండు సినిమాకు సంబంధించినవే అనే క్లారిటీ ఇచ్చేశారు. ఎం ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నిర్మించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.
లేటెస్ట్గా రిలీజైన టీజర్ అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. ఇన్నాళ్లు తన జీవితంలో జరుగుతున్న వివాదాలనే సినిమా చేస్తున్నట్లు టీజర్‌తో స్పష్టం చేశాడు. రమ్య రఘుపతితో గొడవలు.. ఆమె మీడియా ముందుకు వచ్చిన చేసిన ఆరోపణలు, హోటల్లో నరేష్, పవిత్రా లోకేశ్ దొరికిపోవడం వంటి సన్నివేశాలతో టీజర్ మొత్తం రీయల్ ఇన్సిడెంట్స్‌ని రీల్లోకి కన్వర్ట్ చేసినట్లు అనిపిస్తుంది. రమ్య రఘుపతి పాత్రలో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించించి. ఆ పాత్రకు వనిత పర్ఫెక్ట్గా సెట్ అయినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. మరీ ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.