Naresh | జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది వెలుగులోకి రావడమే కాక లైఫ్‌లో సెట్ అయిపోయారు. అలాంటి వారిలో జబర్ధస్త్ నరేష్ ఒకరు. పొట్టి నరేష్‌గా పేరొందిన నరేష్ పొట్టోడు అయిన అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడంలో మాత్రం గట్టోడే. ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో బిజీగా ఉన్నాడు. ఇందులో నరేష్ ఫ్లర్ట్ చేస్తుండడంపై చాలానే ఎపిసోడ్స్ నడిచాయి. అయితే ఎక్కువగా షబీనాతో పొట్టి నరేష్ లవ్ ట్రాక్ ఓ రేంజ్లో క్లిక్ అయింది. వారిద్దరికి సంబంధించి ఎన్నో గాసిప్స్ కూడా వచ్చాయి. కాని షబీనా ఇటీవల వేరే వ్యక్తిని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
అయితే షబీనాతో ఉన్న రిలేషన్ గురించి నరేష్ ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. నాకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. మరో రెండేళ్లలో పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి అందంగా ఉండాలని లేదు కాని, మా అమ్మనాన్నను గౌరవంగా చూసుకునే మనసున్న అమ్మాయి కావాలి. ఇండస్ట్రీ అమ్మాయైనా,బయట అమ్మాయి అయిన నాక పర్లేదు. షబీనా షేక్‌తో లవ్ ట్రాక్ అసలు నిజం కాదు. అది కేవలం రోజా గారి స్కిట్ ఐడియా. స్టేజ్ పరిమితిలోనే అది జరిగింది. ఆమె పెళ్లికి నన్ను కూడా పిలిచింది . కానీ గుంటూర్లో పెళ్లి ఉండడంతో వెళ్లలేకపోయాను. వెళ్లి ఉండి ఉంటే నన్ను చూసి పెళ్లి పీటల నుంచి లేచి వచ్చేదేమో అని సరదాగా కామెంట్ చేశాడు.
ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నరేష్ హ్యూమర్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు నెటిజన్లు. నరేష్ కామెంట్స్ తో వారిద్దరి మధ్య ఏమి లేదని అందరికి ఓ క్లారిటీ వచ్చింది.ఇప్పుడు పూర్తిగా కెరీర్‌పై దృష్టి పెట్టిన నరేష్ త్వరలో మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోనున్నాడు. నరేష్ తన లోపాన్ని బలంగా మార్చుకుని, బుల్లితెరపై తనదైన కామెడీ స్టైల్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ షోతో పాటు మల్లెమాల ప్రొడక్షన్స్‌కు చెందిన ఇతర షోలలోనూ సందడి చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. మనోడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది.