నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్.రాజు దర్శకుడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ అంశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ‘ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. పెళ్లి నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రమిది. వినోదానికి పెద్దపీట వేశాం. నరేష్, పవిత్రాలోకేష్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. జయసుధ, శరత్‌బాబు, వనిత విజయ్‌కుమార్, అనన్య నాగళ్ల, రోషన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్‌రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాత: నరేష్ వీకే, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.