Nara Rohit – Shirisha | తిరుమల: టాలీవుడ్ సినీ నటుడు నారా రోహిత్ తన సతీమణి శిరీషతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్టోబర్ 30న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ నవ దంపతులు, తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నారా రోహిత్ దంపతులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆలయం వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం పూర్తయిన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నటుడు నారా రోహిత్, శిరీషను అక్టోబర్ 30న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత తొలిసారిగా ఈ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.