పొలాచ్చిలో కొత్త షెడ్యూల్?
కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇటీవలే లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలకమైన సన్నివేశాలను దర్శకుడు బాబీ చిత్రీకరించారు.
కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇటీవలే లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలకమైన సన్నివేశాలను దర్శకుడు బాబీ చిత్రీకరించారు. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్‌ని కూడా మొదలపెట్టనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల నుంచే పొలాచ్చిలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నది. రెండు వారాలపాటు సాగే ఈ షెడ్యూల్లో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని వినికిడి. ఇక ఇందులో చిరంజీవి పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ‘వాల్తేరువీరయ్య’లో చిరంజీవిలోని హ్యూమర్‌ని హైలైట్ చేసిన బాబీ.. ఈ సినిమాలో మెగాస్టార్‌లోని ఎమోషనల్ యాంగిల్‌ని చూపిచనున్నారని వినికిడి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. హీరో నారా రోహిత్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నారట. కథలో ఆయన పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని తెలిసింది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నది. తమన్ సంగీత దర్శకుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

