Nara Rammurthy Naidu | నటుడు నారా రోహిత్ ఇంట త్రీవ విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. నార రోహిత్ తండ్రి, ఏపీ సీఎం (AP CM) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) తమ్ముడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే (TDP former MLA) నారా రామ్మూర్తి నాయుడు (Nara Rammurthy Naidu) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో రామ్మూర్తి నాయుడు కన్నుమూసినట్లు తెలుస్తుంది. అయితే రామ్ముర్తి మరణం ఆయన బంధువులతో పాటు రాజకీయ అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది.
ఇదిలావుంటే తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన నటుడు నారా రోహిత్ తన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసాడు. నువ్వు ఒక గొప్ప ఫైటర్‌వి నాన్న.. నువ్వు నా మీద చూపించిన ప్రేమను నేను మర్చిపోలేను.. నాకు జీవితంలో ఎలా ఒడిదుడుగులను ఎదుర్కోవాలో నేర్పించావు. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అది నీ వల్లనే. నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు. మాకోసం నీ జీవితంలో ఎన్నో దూరం చేసుకున్నావు అలానే మరెన్నో త్యాగం చేసావు. నువ్వు చేసిన త్యాగలే మా జీవితాల్లో వెలుగులు నింపాయి. నాన్న నీతో గడిపిన జ్ఞాపకాలు నాకు ముఖ్యమైనవే. జీవితాంతం వాటిని గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తాను.. నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. బై నాన్న అంటూ ఎమోషనల్‌గా సెండ్ ఆఫ్ ఇచ్చాడు నారా రోహిత్.
నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గతంలో 1994 నుంచి 1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గల్లా అరుణ కుమారి చేతిలో ఓటమిపాలవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన మొదటి నుంచి తిరుపతిలో ఎక్కువగా ఉండటంతో పార్టీలో పెద్దగా పాపులర్ కాలేకపోయారు.
Bye Nana…! pic.twitter.com/3lbYzXFwNo
— Rohith Nara (@IamRohithNara) November 17, 2024