ఆనంద్ రవి, దివి లీడ్ రోల్స్ చేసిన డిఫరెంట్ హారర్ మూవీ ‘నెపోలియన్ రిటర్న్స్. ఆనంద్ రవి దర్శకుడు. భోగేంద్రగుప్త నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. దర్శకులు వశిష్ట, సాయిరాజేశ్, నిర్మాత వంశీ నందిపాటి, అనిల్ విశ్వంత్ అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి మాట్లాడతూ ‘ఇది ఇప్పటివరకూ రాని పాయింట్.
ఇందులో తొమ్మిది నెలల బాలుడు ఆత్మగా మారతాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమా సాగుతుంది. తప్పకుండా అందరికీ మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది.’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని నిర్మాత భోగేంద్రగుప్తా చెప్పారు. మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించినందుకు దర్శక, నిర్మాతలకు నటి దివి కృతజ్ఞతలు తెలిపారు. ఆటో రామ్‌ప్రసాద్, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, సహనిర్మాత: జైగోస్వామి.