అగ్ర హీరో నాని నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈచిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ నెల 6న ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని తెలుపుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 1నిమిషం 35సెకన్ల నిడివి గల ఈ టీజర్ ‘ది ప్యారడైజ్’ ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నదని, కథలోని భావోద్వేగాల తీవ్రతను చూపించబోతున్నదని మేకర్స్ తెలిపారు. రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్‌బాబు, తనికెళ్ల భరణి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈచిత్రానికి కెమెరా: సీహెచ్ బాబు, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణం: ఎస్వీఎల్ సినిమా.