The Paradise | ‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాలు గురించి రాసిర్రు గానీ.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే.. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానాకెళ్లి నడిచే శవాల కథ.. అమ్మరొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కథ.. ఒక దగడ్ వొచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. థూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయ్.. ఆ కాకులని ఒకటి చేసిన తిరుగుబాటుదారుడి కథ ఇది.. ఓ యువకుడు నాయకుడిగా మారిన కథ..’ నాని హీరోగా రూపొందుతోన్న ‘ది ప్యారడైజ్’ సినిమా ‘రా స్టేట్మెంట్’ గ్లింప్స్ ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్ ఇది.
దీన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతున్నదో చెప్పేశాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. మృతదేహాలు, మురికివాడలు, ఎగురుతున్న కాకులు.. ఓ అంతుచిక్కని ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు ఈ గ్లింప్స్‌లో. రగ్గ్డ్ లుక్‌తో చిత్రమైన బాడీ లాంగ్వేజ్‌తో, రెండు జడలతో ఆడియన్స్‌కి గూజ్బమ్స్ తెచ్చేలా నాని లుక్ ఉంది. ఈ సినిమాకోసం నాని మేకోవర్ అదిరిపోయింది. తిరుగుబాటు ప్రపంచంలో నాయకుడి ప్రయాణాన్ని చూపించిందీ గ్లింప్స్. వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: జి.కె.విష్ణు, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి.