తన తాజా చిత్రం ‘హిట్ 3’ ప్రమోషన్స్‌లో హీరో నాని బిజీబిజీగా ఉన్నారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. ‘హిట్ 3’ గురించే కాకుండా, సినిమాలపై వస్తున్న రివ్యూలపై కూడా స్పందించారు. ‘ప్రస్తుతం ఎవ్వరినీ ఆపలేకపోతున్నాం. విమర్శలు శృతిమించుతున్నాయి. ఆడియన్స్ సినిమాపై ఒపీనియన్‌కి రాకముందే.. ‘సినిమా ఫ్లాప్’ అంటూ రివ్యూలొచ్చేస్తున్నాయి. ఆ రివ్యూ రాసే వ్యక్తికి సినిమా నచ్చకపోవడం అతని వ్యక్తిగతం. అందరూ అతనిమాట వినాల్సిన పనిలేదు. ఈ రివ్యూలు రాసేవాళ్లకు నేనొక్కటే చెబుతున్నా. పదిరోజులపాటు సినిమాను ఎవరూ చూడకపోతే అప్పుడు డిజాస్టర్ అని డిక్లేర్ చేయండి. అంతేకానీ జనాలు చూసేలోపే డిజాస్టర్ అనేసి సినిమాను చంపేయకండి’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు నాని. ‘హిట్ 3’ గురించి చెబుతూ ‘ఇందులో తుపాకుల కంటే కత్తులనే ఎక్కువ వాడాం. దానికి ఓ కారణం ఉంది. ఉద్దేశపూర్వకంగా పెట్టిన వైలెన్స్ కాదిది. దానికి కూడా ఓ బ్యాక్‌స్టోరీ ఉంది. ఇప్పటివరకూ ‘అర్జున్’ పేరుతో చాలా సినిమాల్లో నటించా. ఇందులో కూడా అర్జున్ సర్కార్‌గా నటించా. ఈ పేరు దర్శకుడి ఛాయిస్. ‘హిట్ 3’ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నా ‘ప్యారడైజ్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదలవుతోంది. ఆ మరుసటి రోజునే రామ్‌చరణ్ ‘పెద్ది’ రిలీజ్ కానుంది. రెండూ బాగా ఆడాలని ఆశిస్తున్నా.’ అని నాని అన్నారు.