Dasara Movie | ఒకప్పుడు వరుస హిట్లతో చెలరేగిపోయినా నాని.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. గత రెండుమూడేళ్లుగా నాని నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రావడంలేదు. దాంతో నాని అభిమానులు ఆయన కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నాని కూడా తన కంఫర్ట్ జానర్ నుంచి బయటకు వచ్చి దసరా అనే అవుట్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులు మెప్పు పొందడానికి ముస్తాబవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వస్తుంది. ఇప్పటికే రిలీజైన పాటలు ఇన్‌స్టాంట్‌గా ఎక్కేశాయి.
‘దసరా’ మూవీతో ఎలాగైనా పాన్ ఇండియా హీరో అయిపోవాలన్న కసితో నాని ఈ సినిమా ప్రమోషన్లను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ జోరుగా జరుపుతున్నాడు. అంతే కాకుండా దీన్ని డబ్బింగ్ సినిమాలా కాకుండా ఆయా భాషల్లో నేరుగా తెరకెక్కించామనే ఫీల్‌ను ప్రేక్షకులకు కలిగించడం కోసం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదట. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టులను, సింగర్స్‌ను తీసుకున్నారట. దీనికోసం ముందుగా మేకర్స్ వేసిన అంచనాలను రెండింతలు ఖర్చయిందట. ఇక ఈ సినిమా హక్కులను హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్ల రేంజ్లో అమ్మాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం సౌత్ సినిమాలుకున్న క్రేజ్ దృష్ట్యా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ రేటు ఓకే అన్నట్లు ఉన్నారట.
అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ సినిమా హిందీ బెల్ట్‌పై హిట్ హిట్టవ్వాలంటే కనీసం రూ.30 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాగా అదే రోజు అజయ్ దేవగన్ నటించిన భోళా రిలీజ్ కానుంది. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. ఇటీవలే రిలీజైన ట్రైలర్ హిందీ ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. పైగా ప్రస్తుతం అజయ్ దేవగన్ ఉన్న ఫామ్‌లో కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా సరే భోళా హిందీ బాక్సాఫీస్ దగ్గర విళయతాండవం చేస్తుంది. మరీ ఈ సినిమా పోటీని తట్టుకుని నాని నిలుస్తాడా లేదా అనేది చూడాలి.
ఇక హిందీ పరిస్థితి ఇలా ఉంటే తమిళంలో ఏకంగా రెండు సినిమాలతో దసరా పోటీ పడాల్సి వస్తుంది. మానాడు, వేందు తానిందు కాదు చిత్రాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన శింబు అదే రోజున పత్తు తాల సినిమాతో వస్తున్నాడు. కన్నడలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన మఫ్టీకి ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. దీనితో పాటుగా విజయ్ సేతుపతి-వెట్రిమారన్ కాంబోలో వస్తున్న విడుతలై కూడా అదే రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. తమిళంలో ఈ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే ట్రైలర్ మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇలా రెండు పెద్ద మార్కెట్లలో నానికి గట్టిపోటీ ఎదురైంది. మరీ ఈ సినిమా పోటీలను తట్టుకుని దసరా గెలుస్తుందా లేదా అనేది చూడాలి.